‘ది డర్టీ పిక్చిర్’‌ నటి అనుమానాస్పద మృతి

126

నటి సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్ట్రీ పిక్చర్’ సినిమాలో నటించిన ఆర్య బెనర్జీ డిసెంబర్ 11న తన కోల్‌కతాలోని తన ఇంటిలో శవమై కనిపించారు. డర్ట్రీ పిక్చర్ లో ఆమె షకీలా పాత్రను పోషించారు. అందిన సమాచారం ప్రకారం.. ఆర్య బెనర్జీ ఉదయం నుంచి డోర్ బెల్స్‌, ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో నెయిబర్స్ కు అనుమానం వచ్చి పోలీసులను పిలిపించారు.

పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి గది తలుపులు పగలగొట్టి తెరిచారు. దాంతో బెడ్‌రూమ్‌లో ఆర్య బెనర్జీ విగతజీవిగా పడివున్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమాస్పద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్‌ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్‌ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.