విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం

83

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఓ కారు కరెంట్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. కారు బలంగా కరెంట్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో స్తంభం విరిగి కారుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరు మంటల్లో చిక్కుకుని మరణించారు. గోకవరం నుంచి వైజాగ్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది.

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం