అప్పగింతల సమయంలో నవ వధువు మృతి

220

పెళ్లి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏడడుగులు, తాళిబొట్టు, మండపం, బంధువుల హడావిడి.. ఇదో ఎత్తు అయితే.. పెళ్లి తర్వాత అప్పగింతలు మరో ఎత్తు. పెళ్లి రోజు అందరు హ్యాపీగా ఉంటారు. కానీ బాదంతా అప్పగింతల రోజే వధువు కుటుంబ సభ్యుల ముఖాల్లో బాధ కనిపిస్తుంది. కొందరు కన్నీరు పెట్టుకుంటారు. మరికొందరు కన్నీటిని దిగమింగుకొని తమ కూతురిని అత్తారింటికి పంపుతారు. ఇక మళ్లీ రాదని తెలిసి ఎంతో బాధపడతారు. సున్నితమైన మనస్సు ఉన్న వాళ్లు.. ఏడుస్తూ.. కుప్పకూలిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది.

అత్తారింటికి వేళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ వధువు మృతి చెందింది. ఒడిశాలోని సోనేపూర్‌ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడితో పెళ్లి జరిగింది. మరుసటి రోజున.. అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరపగా.. ఆమె మృతిచెందిందని నిర్ధారించారు. అతిగా ఏడవటంతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.. దింతో వధువు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అప్పగింతల సమయంలో నవ వధువు మృతి