ఏం కష్టం వచ్చిందో.. పెళ్ళైన 16 రోజులకే నవవధువు ఆత్మహత్య

68

ఇష్టం లేని పెళ్లి చేయడంతో నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చెయ్యకుండా వేరే వ్యక్తికీ ఇచ్చి పెళ్లి చేయడంతో మనస్తాపానికి గురైన రవళి అనే నవవధువు అత్తారింట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరికి చెందిన రవళితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన రాజుకు 16 రోజుల క్రితం వివాహం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని సూసైడ్ నోట్ రాసి సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన చావుకు ఎవరు కారణం కాదు. అమ్మ నీకు తెలుసు కులం, మతం చూడొద్దు.

భర్తకు క్షమాపణ చెబుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసింది. పెళ్ళైన 16 రోజులకే కూతురు మృతి చెందటంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. బంధువుల రోదనలతో మాణిక్యపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

ఏం కష్టం వచ్చిందో.. పెళ్ళైన 16 రోజులకే నవవధువు ఆత్మహత్య