Telangana Lovers : ప్రియురాలికి విషం తాపిన ప్రియుడు..

169

సమాజంలో అమ్మాయిలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. ప్రతి రోజు ఎదో ఒక చోట అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ ముసుగు కప్పుకున్న కఠినాత్ములు అమ్మాయిల ప్రాణాలను హరిస్తున్నారు. గొంతు కోసి ఒకడు, కత్తిపోట్లు పొడిచి మరొకడు. విషమించి ఇంకొకడు. ఇలా ఎందరో అమ్మాయిల ప్రాణాలను హరిస్తున్నారు. ప్రేమించలేదంటే వేధింపులు, ప్రేమించిన తర్వాత పెళ్ళికి ఒప్పుకోకపోతే వేధింపులు, పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు, ఈ వేధింపులతోనే కొందరి జీవితాలు ముగిసిపోతున్నాయి.

ఇక ఆదివారం జరిగిన ఓ ఘటన ప్రేమికుడు అనే పదానికే మచ్చ తెచ్చే విధంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లిలో ప్రేమ పేరిట 15 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేశాడు బండి రాజు అనే యువకుడు. ఓగులాపూర్ గ్రామానికి చెందిన బండి దేవయ్య జ్యోతిల కుమారుడు బండి రాజు , గత కొన్ని సంవత్సరాల నుండి తంగళ్ళపల్లి లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఈ గ్రామానికి చెందిన 15 ఏళ్ల యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేశాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ఆదివారం రాత్రి ఒంటి గంట తరువాత రాజు, ఆ బాలికకు మాయమాటలు చెప్పి పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు..

అనంతరం పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో అదే రాత్రి ప్రభుత్వాసుపత్రికి ఆ బాలికను తీసుకెళ్లాడు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇంతలోనే తల్లిదండ్రులు చావు బతుకుల మధ్య ఉన్న తమ కూతురిని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా,రెండు రోజులు చికిత్స అనంతరం బాలిక పరిస్థితి విషమించడంతో స్థానిక సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మరణించింది. తమ పాప మృతికి రాజు కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాడిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను వేడుకున్నారు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఉండాలి అంటే వాడిని ఉరితీయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Telangana Lovers : ప్రియురాలికి విషం తాపిన ప్రియుడు..