టెస్ట్ జట్టు తుది ఆటగాళ్ల జాబితా విడుదల

76

భారత్ ఆస్ట్రేలియా మధ్య 17 తేదీ నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జరిగిన వన్డే, టి20 సిరీస్ లలో చెరో టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇక మూడు టెస్టుల సిరీస్ లోని మొదటి మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ జట్టును ప్రకటించింది. అందులో వార్మప్‌ మ్యాచ్‌ల్లో రాణించిన రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్ జట్టులో స్థానం దక్కలేదు. వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షా చోటు దక్కించుకున్నారు.

జట్టు సభ్యులను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ను ఎంపిక చేశారు. ఇక టీం ఇండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆడనున్నారు. ఇప్పటికే రోహిత్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. కరోనా కారణంగా 14 రోజులపాటు హోమ్ క్వారైటైన్ లో ఉండనున్నారు.

టెస్ట్ జట్టు తుది ఆటగాళ్ల జాబితా విడుదల