విశాఖలో ప్రమాణాల రాజకీయం.. భారీగా పోలీసుల మోహరింపు

44

విశాఖలో ప్రమాణాల రాజకీయం తారాస్థాయికి చేరుకుంది.. అక్రమాస్తులు, కబ్జాలపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఈస్ట్ పాయింట్ కాలనీ, సాయిబాబా ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలనీ వైసీపీ కార్యకర్తలు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆలయం వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. కానీ శాంతిభద్రతల కారణంగా ఎమ్మెల్యేను పోలీసులు గృహనిర్బంధం చేశారు..

అయితే ఎమ్మెల్యే గుడికి రాకపోతే ఆయన కార్యాలయానికి సాయిబాబా ఫోటో తీసుకెళ్లి ప్రమాణం చేయిస్తామని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.. దాంతో వెలగపూడి నివాసం వద్దకు వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో.. ఇటు ఆలయం వద్ద అటు వెలగపూడి నివాసం వద్దకు టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు.. దీంతో పెద్దఎత్తున మోహరించారు పోలీసులు.