ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి స్వామి స్వరూపానందేంద్ర కీలక సూచనలు

85

ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మొన్న రామతీర్థం, నిన్న రాజముండ్రి. నేడు కర్నూలు జిల్లా కోసిగి మండలం మర్లబండలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలను శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వామి ఖండించారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లికి సూచించారు.

ఈ ఘటనలపై మంత్రి వెల్లంపల్లితో స్వామి స్వరూపానందేంద్ర సుదీర్ఘంగా చర్చించారు. ఇటువంటి దాడులు జరగడం వలన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలన్నారు. ఈ భేటీలో వెల్లంపల్లితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.