31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ దేవాలయం

171

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో 31 ఏళ్ళక్రితం మూసివేసిన దేవాలయాన్ని మంగళవారం తెరిచారు. శ్రీనగర్ లోని హబ్బా కడల్ ప్రాంతంలో శీతల్ నాథ్ దేవాలయం ఉంది. టెర్రరిస్టుల దాడులు పెరిగిపోవడం, హిందువుల జనాభా తగ్గిపోవడంతో దేవాలయాన్ని 1990లో మూసివేశారు అప్పటి పూజారి. ఇక మంగళవారం దేవాలయాన్ని ఓపెన్ చేసి ప్రత్యేక పూజలు చేశారు. సంతోష్ రాజదాన్ అనే భక్తుడు దేవాలయం తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ జనాభా తగ్గిపోవడంతో దేవాలయం మూసివేశారు.. బాబా శీతల్ నాథ్ భైరవ్ జయంతి రోజే వసంత్ పంచమి వస్తుంది. ఇక ఈ రోజు పూజలు చేసేందుకు తాము దేవాలయ తలుపు తీసినట్లు తెలిపారు..

స్థానికంగా ఉన్న ముస్లిమ్స్ తమకు ఎంతగామో సహకరించారని తెలిపారు. దేవాలయాన్ని శుద్ధి చేసేందుకు తమకు సహాయం చేశారని వివరించారు. పూజకు అవసరమైన సామాగ్రిని కొని ఇచ్చారని తెలిపారు. ఇక మీదట దేవాలయం ప్రతి రోజు ఉంటుందని సంతోష్ రాజదాన్ తెలిపారు. ఇక ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. 2019 నుంచి 2020 వరకు 157 మంది ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. గతంలో ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉండేవి. అయితే 1990లో జరిగిన అల్లర్లలో అక్కడ ఉన్న హిందువులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. దింతో శీతల్ నాథ్ దేవాలయం మూతపడింది.

31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ దేవాలయం