నగరాన్ని వణికిస్తున్న చలి

61

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రెండు రోజుల వ్యవధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీలు పడిపోయాయి. దింతో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు ఉదయం వేళల్లో రహదారులను మంచు కప్పేస్తుంది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతన్నారు. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 – 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర శివార్లలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రామచంద్రాపురంలో అత్యల్పంగా 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత రాజేంద్రనగర్‌లో 12.5. ఉప్పల్‌ – 13.1, అల్వాల్‌ -13.7, బేగంపేట -14.1, కుత్బుల్లాపూర్‌ – 14.4, ఎల్‌బీనగర్‌లో 14.8, చందానగర్‌ – 14.9, గాజుల రామారం – 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.