తెలుగు రాష్ట్రాలకు నూతన ప్రధాన న్యాయమూర్తులు

107

తెలుగురాష్ట్రాల‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీని ఎంపిక చేశారు. అలాగే ఏపీకి అరూప్‌ గోస్వామిని ఎంపిక చేశారు. ప్రస్తుతమున్న తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆర్ ఆర్ చౌహన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేశారు.. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ జేకే‌ మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ బదిలీ ఉత్తర్వులను రాష్ట్రపతికి పంపింది కొలీజియం.