తెలంగాణలో దారుణం

207

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని మొసలి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజి పేటలో చోటుచేసుకుంది. రాములు అనే పశువుల కాపరిపై మొసలి దాడిచేసి నీళ్ళలోకి ఈడ్చుకెళ్లి అతనిని చంపేసింది. పశువులు నీరు తాపేందుకు వెళ్లిన రాములు మొసలికి బలైనట్టు చెబుతున్నారు. అతని మీద మొసలి దాడి చేసినప్పుడు ఒడ్డు మీద ఉన్న ఇతర పశువుల కాపరులు తమ వద్ద ఉన్న కర్రలతో ఒడ్డు మీద నుంచే నీళ్లపై గట్టిగా కొడుతూ అరుపులు, కేకలు వేశారు. అయినా రాములుని మాత్రం మొసలి విడిచిపెట్టలేదని అంటున్నారు. కొద్దిసేపటి తర్వాత నీటిలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలో దారుణం