గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

316

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. మార్చి 14న తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును ఖరారు చేసింది అధిష్టానం.

అయితే ఇప్పటికే వీరిద్దరికి ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు అనధికారికంగా తెలిపారు. తమ పేర్లు ఖరారు అవుతాయని నమ్మకం ఉండటంతో నేతలు ప్రచారం మొదలు పెట్టారు. మంగళవారం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దింతో సోమవారం పేర్లు ఫైనల్ చేసింది. తద్వారా మరో ఎన్నిక కోసం తాము పోటీ పడుతున్నట్లు బీజేపీ సంకేతాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే దుబ్బాక, గ్రేటర్ గెలుపుతో జోరుమీదున్న బీజేపీ, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికపై కూడా బీజేపీ దృష్టిపెట్టింది. నోటిఫికేషన్ రానప్పటికీ నాగార్జున సాగర్ లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించింది బీజేపీ అధిష్టానం.. ఈ నేపథ్యంలోనే తాజాగా హుజుర్ నగర్ లో ఓ సభను కూడా నిర్వహించారు.. ఈ సభకు సాగర్ ఎన్నికలకు లింక్ ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హుజుర్ నగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ డ్యామ్ ముంపు బాధితులకు భూములు కేటాయించారు. అయితే ఆ భూములను కొందరు కబ్జా చేసారంటూ గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 7 తేదీన సభ నిర్వహించారు. దొంగపట్టాలను రద్దు చేసి గిరిజనులకు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ