కరోనా బులిటెన్ రోజు విడుదల చెయ్యాలి

231

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని పేర్కొంది. వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. ప్రస్తుతం నిలిపివేసిన కరోనా బులిటెన్ ను శుక్రవారం నుంచి రోజూ విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చెయ్యాలని సూచించింది. ఇక ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

కరోనా బులిటెన్ రోజు విడుదల చెయ్యాలి