Telangana Budget: కాసేపట్లో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు?

398

Telangana Budget: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కొంతకాలంగా కసరత్తులు జరుగుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై శనివారం సీఎం సమీక్ష సమీక్షించనున్నారు. ఈ భేటీలోనే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నమే మంత్రి హరీశ్​రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రగతిభవన్ చేరుకోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకొని 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ తగ్గిన రాష్ట్ర ఆదాయం, ప్రజల ఆర్ధిక కష్టాల నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో సర్కార్ ఖజానాకు ఆదాయం పూర్తిగా పడిపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 57 వేల కోట్ల రూపాయల మేరకు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేటాయింపులు ఎలా చేయాలి అనే దానిపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ బడ్జెట్ లో నిరుద్యోగ భృతితో పాటు సంక్షేమానికి పెద్ద పీఠ వేయాలని భావించిన సర్కార్ కోవిడ్ పరిస్థితులలో వాటిని ఎలా మ్యానేజ్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.