తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయి..

180

ప్రేమ సరిహద్దులు దాటింది. వివాహంతో ఒకటి చేసింది. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండలం మసిరెడ్డితండాకు చెందిన యువకుడు. నేపాల్ కు చెందిన యువతిని పెళ్లాడాడు.. ప్రేమికుల దినోత్సవం రోజే వీరి పెళ్లి జరిగింది. కాగా మసిరెడ్డితండాకు చెందిన మాలోతు లక్ష్మి – బద్యి దంపతుల కుమారుడు రమేష్, 2013లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే నేపాల్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీఠలు ఎక్కింది.

అయితే వీరు ఆరునెలల క్రితమే అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కరోనా కారణంగా ఇండియాకు రాలేకపోయారు. ఇంట్లో వాళ్ళు పెళ్ళిసంబందాలు చూస్తుండటంతో రమేష్ విషయం ఇంట్లో తెలిపాడు.. దింతో వారు ఇక్కడ పెళ్లి జరిపించాలని నిశ్చయించుకొని ప్రేమికుల రోజు నాడే రమేష్, కుమారిలను హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటి చేశారు. చూడముచ్చటైన ఈ కొత్త జంటను చూసేందుకు తండావాసులు తరలివచ్చి ఆశీర్వదించారు.

తెలంగాణ అబ్బాయి.. నేపాల్ అమ్మాయి..