అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం

119

అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగుల లక్షాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ చేధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 తో ఆసీస్ ముందజలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కేవలం 36 పరుగులకే ఇన్నింగ్స్‌ ముగించి టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో వచ్చిన 54 పరుగుల ఆధిక్యం ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.