ఇది మాములు విజయం కాదు

190

భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం సామాన్యమైనది కాదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. గబ్బా గడ్డపై 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ఓటమి పాలైంది.. ఈ చారిత్రాత్మక విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత్ గెలుపుపై పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుందని భారత ప్రధాని మోడీ అన్నారు. అద్భుతమైన శక్తి మరియు అభిరుచి అంతటా కనిపించిందని. సంకల్పంతో ఆడి జట్టుకు విజయాన్ని అందించారని అభినందనలు తెలిపారు. ఇక సచిన్ టెండూల్కర్ కూడా ఈ విజయంపై స్పదించారు. ఒక్కో సెషన్ లో ఒక హీరో కనిపించారని తెలిపారు. గాయాలు తట్టుకొని మంచి విజయం అందించారని అన్నారు. గొప్ప విజయాల్లో ఇది ఒకటని తెలిపారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మొదటి ఇన్నింగ్స్‌లో 369, రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో టార్గెట్‌ను 97 ఓవర్లలో ఛేదించింది. 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. దింతో నాలుగు టెస్టుల సిరీస్ లో 2 – 1 తేడాతో భారత్ జట్టు కప్పు కైవసం చేసుకుంది.

సీనియర్లు త్వరగా అవుట్ అయినా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (91), రిషబ్ పంత్(89 నాటౌట్‌) దీటైన బ్యాటింగ్ ‌తోపాటు ఆస్ట్రేలియా పేసర్ల బౌన్సర్లకు శరీరమంతా గాయపడినా పోరాడిన పుజారా (56) కలిసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.

ఇది మాములు విజయం కాదు