బీజేపీలోకి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ?

294

దేశ వ్యాప్తంగా బీజేపీ హావ నడుస్తుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన విజయ దుండుగి మోగిస్తుంది బీజేపీ. బీహార్, గ్రేటర్ హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ స్థానిక ఎన్నికలు. తాజాగా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో ఎన్నడు సాధించని సీట్లు సాధించింది. ఈ విజయాలను చూసి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేతల నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది. అయితే ఎప్పుడు చేరతారు అనే దానిపై క్లారిటీ లేదు.

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరడం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక ఇప్పటికే బెంగాల్ కు చెందిన చాలామంది నేతలు బీజేపీలో చేరుతున్నారు. కమ్యూనిస్టులు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అధికార తృణమూల్ పార్టీకి చెందిన చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారు. ఒకవేళ బీజేపీలోకి సౌరవ్ రావడం ఖాయమైతే ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. అయితే మొదటినుంచీ సౌరవ్ బీజేపీ నేతలకు టచ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సౌరవ్ కు బీసీసీఐ పదవి కట్టబెట్టారు. సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని దాదా గత కొంతకాలంగా తహతహలాడుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి కూడా వార్తలు వచ్చాయి.

ఇక మరోవైపు బెంగాల్ లో విజయంపై కన్నేసింది బీజేపీ. అమిత్ షా, నడ్డా పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మమతను ఇంటికి పంపాలని కంకణం కట్టుకున్నారు ఇరువురు నేతలు. ఈ నేపథ్యంలోనే నడ్డా నెలకు నాలుగు సార్లు పశ్చిమ బెంగాల్ వెళ్లి పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అమిత్ షా కూడా స్పీడ్ పెంచనున్నారు. మరోవైపు మమతా బీజేపీపై ఎదురు దాడికి దిగుతుంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు మమతా. ఎంత మంది అమిత్ షాలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని ఘంటాపదంగా చెబుతున్నారు మమత

బీజేపీలోకి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ?