టీడీపీ సీనియర్‌ నేత మృతి

157

తెలంగాణ టీడీపీ సీనియర్‌ నాయకుడు అనారోగ్యంతో మరణించారు. చిలకలగూడకు చెందిన యాదగిరి గతకొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. గురువారం ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. దీంతో మృతదేహం వద్ద టీడీపీ సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వల్లారపు శ్రీనివా‌స్‌కుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు జీవీ కృష్ణ, పార్టీ నేతలు మల్లేష్ యాదవ్‌, తడక వినోద్‌, సురేష్‌, అలెక్స్‌, విక్రమ్‌ తదితరులు నివాళులర్పించారు. యాదగిరి కుటుంబాన్ని ఆదుకుంటామని పార్టీ తరఫున భరోసా ఇచ్చారు.