Atchannaidu arrest : టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్

86

ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోమవారం కోటబొమ్మాళి పీఎస్ లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. వైసీపీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఇక అచ్చెన్నాయుడి అరెస్ట్ పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Atchannaidu arrest : టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్