హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ

370

ఏపీలో నాలుగోవిడత పంచాయితీ ఎన్నికలో కూడా అధికార వైసీపీ హావ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13097 పంచాయితీల్లో వైసీపీ 10,382 పంచాయితీల్లో విజయం సాధించగా, టీడీపీ 2,063 పంచాయితీలను కైవసం చేసుకుంది. ఇతరులు 475 స్థానాల్లో విజయం సాధించారు.

ఇదిలా ఉంటే హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. 38 పంచాయితీలకు గాను 30 పంచాయితీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు.

హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందాడు. అనేక మంది టీడీపీ నేతల గ్రామాల్లో వైసీపీ విజయం సాధించింది. నారావారి పల్లెలో కూడా వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక అమరావతి గ్రామాల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయమ్స్ సాధించారు.

హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ