సీఎం జగన్‌కు చంద్రబాబు బ‌ర్త్‌డే విషెస్‌!

56

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు చంద్రబాబు. అందులో ఇలా పేర్కొన్నారు.. ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అందులో జగన్‌ను ట్యాగ్ చేశారు.