భర్త మృతిని తట్టుకోలేక ఆసుపత్రి పైనుంచి దూకిన భార్య

164

భర్త మృతిని తట్టుకోలేని భార్య ఆసుపత్రిలోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌, కరుంపాళయంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ రోడ్ జిల్లా భవానీ కలింగరాయన్‌పాళయంకు చెందిన శేఖరన్‌ (50), నాగరత్నం (46) దంపతులకు వివాహమై 26 ఏళ్లు క్రితం వివాహం జరిగింది. శేఖరన్ మంగళవారం పన్నారి రోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దింతో అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడే చికిత్స పొందుతూ శేఖరన్ మృతి చెందారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న భార్య నాగరత్నం ఆసుపత్రిలోని 7 వ అంతస్తు నుంచి దూకింది. దింతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న కోవిల్‌పాళయం పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ దంపతులకు పిల్లలు కలగలేదు.. భర్త లేని జీవితం తనకెందుకు అనుకున్న నాగరత్నం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. భార్య, భర్త మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భర్త మృతిని తట్టుకోలేక ఆసుపత్రి పైనుంచి దూకిన భార్య