తమిళనాడులో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

239

తమిళనాడులో విరుదునగర్ ఘోర ప్రమాదం జరిగింది. బాంబుల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో మొత్తం 11 మంది మృతి చెందినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఆకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతుంది. ఘటన విషయం తెలుసుకున్న సీఎం పళనిస్వామి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని తెలిపారు.

కాగా తమిళనాడులో అత్యధికంగా ఫైర్ క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనిమీదనే 25 లక్షలమంది జీవనం సాగిస్తుంటారు. అయితే తరచుగా ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏడూ పదుల సంఖ్య ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్న రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి.

తమిళనాడులో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి