శ్రీవారికి భారీ విరాళం అందించిన తమిళ భక్తులు

74

తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందచేశారు తమిళభక్తులు. తమిళనాడులోని ఉల్లందురుపేటలో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ. 3.16 కోట్లతో పాటు 20 కోట్ల రూపాయల విలువచేసే భూములను విరాళంగా అందించారు. స్వర్ణ తిరుమల అథితి గృహంలో శనివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విరాళ డీడీని టీటీడీ పాలకమండలి సభ్యులు కుమారగురు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ మాట్లాడుతూ, త్వరలో ఉల్లందూరుపేట, జమ్మూకశ్మీర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా మొదట తమిళభక్తులు విరాళాన్ని టీటీడీ పాలకమండలి సభ్యుడు కుమారగురుకు అందించారు. ఆయన తిరుమలలో టీటీడీ చైర్మన్ కు అందించారు.

 

శ్రీవారికి భారీ విరాళం అందించిన తమిళ భక్తులు