ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి తిప్పలు పడుతున్న తమన్నా: వీడియో వైరల్

360

రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతుంటారు. చాలామంది తమ నిత్యజీవితంలో వర్కౌట్ కు కొంతసమయం కేటాయిస్తారు. అలానే మిల్కి బ్యూటి తమన్నా కూడా రోజు జిమ్ చేస్తున్నారంట. గత రెండు నెలలుగా క్రమశిక్షణతో జిమ్ చేస్తూ బరువుతగ్గారట ఈ నటి. ఈ విషయాన్నీ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కరోనా బారినపడిన తర్వాత తాను వెయిట్ పెరిగానని. రెండు నెలలు కాసపడి కరోనాకు ముందు ఉన్న బరువుకు వచ్చానని తెలిపారు. ‘‘ఏదైనా సరే అతిగా చేయక్కర్లేదు. చేసే పనిలో స్థిరత్వం ఉంటే ఏదైనా సాధించొచ్చు. రెండు నెలల పాటు ఎంతో క్రమశిక్షణతో వర్కౌట్స్‌ చేశాను. కోవిడ్‌ రాకముందు ఎలా ఉన్నానో అలా మారిపోయాను. వర్కౌట్స్‌ చేయకపోవడానికి వంకలు వెతక్కండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి’’ అన్నారు తమన్నా. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)