Swethabasu: రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చా!

404

Swethabasu: ఎలేలి పాలు ఒలకమ్మ.. అయి బాబోయ్ ఏదేదో అయిపోతుంది. ఈ మాటలు చదవగానే మీకు చాలా క్యూట్ గా.. అంతే అమాయకంగా చెప్పిన ఒక అమ్మాయికి గుర్తిచ్చి ఉండాలే. ఔను శ్వేతాబసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో చెప్పిన డైలాగ్సే. ఆ సినిమాతో టీనేజ్ కుర్రకారుకి గిలిగింతలు పెట్టిన శ్వేతా తర్వాత చేసిన సినిమాలు కలిసిరాక.. అలానే సెక్స్ స్కాండల్ లో ఇరుక్కొని చాలా ఇబ్బందులే ఎదుర్కొంది. మొత్తంగా ఆ స్కాండల్ నుండి నిర్దోషిగా బయటపడి బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి కలిసిరాక విడాకులు అయింది.

ఫైనల్ గా మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్ లో ‘ఇండియా లాక్ డౌన్’ అనే సినిమాలో నటిస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే పాయింట్ తో మధుర్ బండార్కర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కాగా శ్వేతా ఇందులో సెక్స్ వర్కర్ ‘మెహ్రునిస్సా’గా కనిపించనుంది. కరోనా సమయంలో రెడ్ లైట్ ఏరియాలో వేశ్యా వృత్తిలో ఉన్న ఆడవాళ్లు ఎలాంటి సమయాలు ఎదుర్కొన్నారో ఈ సినిమాలో చూపించాలన్నది ఈ సినిమా మేకర్స్ ఉద్దేశ్యం.

అందుకోసం శ్వేతాబసుతో పాటు సినిమా యూనిట్ కూడా ముంబై కామటిపుర రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారట. అక్కడి వారి బాష ఎలా ఉంటుంది.. లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు వంటి అంశాలను శ్వేతా అంతే నేటివిటీతో తెరమీద పలికించనుందట. అంతేకాదు.. సినిమాలో శ్వేతా చేస్తున్న మెహ్రునిస్సా అనే వేశ్యను కలిసి ఆమె పాత్రనే సినిమాలో చూపిస్తున్నట్లుగా ఆమెకి కృతజ్ఞతలు కూడా చెప్పేసి వచ్చారట. ఇప్పటికే ఇండియన్ సినిమాలో చాలామంది వేశ్యా పాత్రలలో నటనా విశ్వరూపం చూపించేసారు. మారి శ్వేతా ఏ రేంజ్ యాక్టింగ్ చూపిస్తుందో చూడాలి మరి!

Swethabasu: రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చా!