ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి

90

విజయవాడలో ఓ ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన వాంబే కాలనీలో చోటుచేసుకుంది. ఈవెంట్ డాన్సర్ గాయత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే నీలిమా అనే యువతి గాయత్రి ఇంటికొచ్చిందని.. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది. నీలిమా వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో ఊరికి వేలాడింది.

ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీష్‌ బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయత్రి ఆత్మహత్యను అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నీలిమ తోపాటు గాయత్రీ భర్త సతీష్‌ ను పోలీసులు విచారిస్తున్నారు.