Sushmita Sen: పాపం మళ్ళీ ఒంటరైన ముదురుభామ!

360

ఈ సినిమా వాళ్లున్నారే వీరి ప్రేమలు అర్ధం కాదు.. వీరు అంతకన్నా అర్ధం కాదు. మొన్న ఓ వ్యక్తితో చెట్టాపట్టేసుకొని తిరుగుతూ కెమెరాలకు చిక్కుతారు.. నేడు ఇంకో చేయి పట్టుకొని ఏ బీచ్ లోనో పబ్బులోనో కనిపిస్తారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది చాలా అంటే చాలా కామన్ మ్యాటర్ అయిపొయింది. అందరూ అలానే ఉన్నారని చెప్పలేం కానీ చాలామంది జస్ట్ రిలేషన్, డేటింగ్ ఇదే పంథాలో ఉన్నారు. ఈమధ్య ముదురు భామలైతే లేత కుర్రాళ్ళ మీద మనసుపడడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

వీరిలో కొందరు వయసును పక్కనపెట్టి పెళ్లి పీఠల వరకు వెళ్తే మరికొన్ని కొన్నేళ్లు ఏళ్ళ తరవాత బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా ఒకరు. నాలుగు పదుల వయసు దాటినా ఈ ముదురు భామ తనకంటే 15 ఏళ్ళ చిన్న వాడైన ఓ యువ మోడల్ తో చాలా రోజులుగా డేటింగ్ చేస్తోంది. ఏకంగా అతడితో ఇంట్లోనే కాపురం పెట్టేసింది. సుష్మితా దత్తత తీసుకున్న పిల్లలు, ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ కరోనా లాక్ డౌన్ కూడా ఆనందంగా గడిపేశారు.

కానీ ఏమైందో ఏమో కానీ ఈ బంధం బ్రేక్ అయినట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. అందుకు కారణం సుస్మితా చేసిన ఒక పోస్ట్. తాజాగా సుస్మితా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘స‌మ‌స్య ఏమిటంటే అత‌డు మారుతాడ‌ని మహిళ భావిస్తుంది. కానీ అత‌డు మార‌డు. పురుషులు చేసే త‌ప్పును ఆమె ఎప్పటికీ క్షమించ‌దు. ఆమె వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ క‌థ‌లో నీతి ఏంటంటే అత‌డు మార‌డు. ఆమె వెళ్లిపోతుంది’ అంటూ ఓ కొటేషన్ రాసుకొచ్చింది. దీంతో ప్రియుడితో బ్రేకప్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Sushmita Sen: పాపం మళ్ళీ ఒంటరైన ముదురుభామ!