మరో విషాదం : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కో-స్టార్ సందీప్ ఆత్మహత్య

188

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఎంఎస్ ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కో-స్టార్ సందీప్ నహర్ (33) ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని తెలిపారు. ఆత్మహత్యకు ముందు 10 నిమిషాల నిడివిగల వీడియోను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు సందీప్.

May be an image of 4 people and people smiling

ఈ వీడియోలో అనేక అంశాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు ఎదురుకున్నానని తెలిపారు. ఇటు వ్యక్తిగత జీవితంలో.. అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు ఉన్నట్లుగా వీడియోలో పేర్కొన్నారు సందీప్. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

May be an image of 9 people and people smiling

తన భార్య గురించి అనేక ఆరోపణలు చేశారు. మానసికంగా కుంగి కృశించుకు పోయానని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయన ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌లో మరోసారి అలజడి రేగింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు ఇప్పటికీ ప్రకంపనలు రేపుతుండగా..

May be an image of 4 people, people smiling and text that says "REAL REEL BAS"

తాజాగా అదే సినిమాలో నటించిన మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ కలచివేస్తోంది. ఇక ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరో విషాదం : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కో-స్టార్ సందీప్ ఆత్మహత్య