సురేష్ రైనా సంపాదన రూ. 100 కోట్లు

239

భారత క్రికెటర్లకు ఐపీఎల్ ఓ వరం అని చెప్పుకోవాలి. ఐపీఎల్ మూలంగా భారత్ స్టార్ క్రికెటర్లు భారీగా సంపాదించారు. సురేష్ రైనా ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి 100 కోట్ల రూపాయల వేతనం తీసుకున్నారు. ఇక ఈ జాబితాలో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి ధోని రూ. 150 కోట్ల వేతనం అందుకున్నారు. ఇక ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ రూ 131 కోట్ల వేతనం తీసుకోగా టీం ఇండియా విరాట్ కొల్లీ 126 కోట్ల రూపాయల వేతనం తీసుకున్నారు.

సురేష్ రైనా గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి కుటుంబ సమస్యలతో తప్పుకున్నారు. దుబాయ్ వెళ్లిన రైనా మ్యాచ్లు ప్రారంభం కాకముందే ఇండియాకు తిరిగి వచ్చారు. రైనా కుటుంబంలో ముగ్గురు హత్యకు గురికావడంతో ఆయన ఇండియాకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. రైనా వెళ్లిపోవడంతో చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ తరుణంలోనే రైనా చెన్నై జట్టునుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చే సీజన్ కు సురేష్ రైనాను రిటైన్ చేసుకుంది చెన్నై. సురేష్ రైనాకు 11 కోట్ల రూపాయల వేతనం చెల్లించనుంది.

సురేష్ రైనా సంపాదన రూ. 100 కోట్లు