పంచాయతీ ఎన్నికలపై 25న ‘సుప్రీం’ విచారణ

233

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణను ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌

అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈనెల 25న విచారించనున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు. 68 డివిజన్లలో నాలుగు‌ విడతలుగా 659 మండలాల్లో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగించారు నిమ్మగడ్డ.