ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

158

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయితీ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణ కష్టమైన ప్రక్రియ కాదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ నిర్ణయంలో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా తీర్పు నేపథ్యంలో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.