బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు

738

ఇరాక్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని బగ్దాద్ లోని ఓ మార్కెట్ లో గుర్తుతెలియని వ్యక్తి పేలుడు జాకెట్ ధరించి తనను తాను పేల్చుకున్నాడు.. ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలు అయ్యాయని వైద్య వర్గాలు గురువారం తెలిపాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అందువల్ల మరణాల సంఖ్య పెరగవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఇరాక్ రాజధానిలో ఇది చాలా అరుదైన ఘోరమైన దాడిగా పోలీసులు చెబుతున్నారు, 2017 లో ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ పరాజయం పాలైనప్పటి నుండి ఇలాంటి బాంబు దాడులు జరగలేదు.