మోత మోగించిన స్టాక్ మార్కెట్.. కొత్త శిఖరాలకు

146

దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి. గత వారం పడుతూ లేస్తూ నడిచిన మార్కెట్.. ఈ వారం ప్రారంభంలోనే పరుగందుకుంది. దింతో చరిత్రలో అల్ టైం రికార్డ్ కి చేరింది. 52 వేలు దాటి.. 52500 వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 503 పాయింట్ల లాభంతో 52047వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 15290 వద్ద కొనసాగుతున్నాయి. అటు బ్యాంకింగ్‌ కౌంటర్‌ కూడా శుక్రవారం నాటి జోష్‌ను కొనసాగిస్తోంది.

ఇక ఈ రోజు లాభాల్లో నడుస్తున్న వాటిని పరిశీలిస్తే. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్ లాభంతో ఉన్నాయి.ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్,ఎస్‌బీఐ కూడా లాభపడుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ. టెక్‌ మహీంద్రా.ఎస్‌బీఐ లైఫ్‌, హీరోమోటోకార్ప్‌ , కోల్‌ ఇండియా నష్టపోతున్నాయి.

మోత మోగించిన స్టాక్ మార్కెట్.. కొత్త శిఖరాలకు