పావురాలకు దూరంగా ఉండండి.. వాటితో సెల్ఫీ తీసుకోకండి

181

నగరంలో పావురాలకు కొదవ లేదు ఎక్కడ చూసిన అవే కనిపిస్తాయి. ఇక వీటికి ఆహారం అందించేందుకు అంగరంలో 500 ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడకు చాలామంది వచ్చి వాటికీ ఆహారం అందిస్తుంటారు. సెల్ఫీలు దిగుతుంటారు. చిన్నారులైతే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మీదట కొద్దిరోజులపాటు పావురాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దేశంలో బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వివరిస్తున్నారు. పావురాల గుంపులోకి వెళ్లడం కానీ వాటితో సెల్ఫీ దిగడం కానీ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

అయితే ఇప్పటికే తెలంగాణలో అక్కడక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇక వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి నగరానికి వచ్చే పక్షుల వలన ఇక్కడ ఉన్న పక్షులకు ఈ ఫ్లూ ప్రబలే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే మంచిదని చెబుతున్నారు పక్షి నిపుణులు. ఇక నగరంలో పావురాల సంఖ్య విపరీతంగా వృద్ధి చెందుతుంది. దింతో ఈ పరిస్థితుల్లో వాటినుంచి మానవాళికి ముప్పు రాకుండా ఉండాలి అంటే వాటికీ దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

అయితే పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలామందికి అలవాటు. ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లేవారు తమ వెంట గింజలను తీసుకెళ్లి వాటికీ ఇస్తూ ఆనందాన్ని పొందుతుంటారు. ఇటువంటి వారు కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు. అయితే ఈ గింజలు అందించేవారిలో అధికమంది వృద్ధులే ఉంటారు. ఉద్యోగం నుంచి విరమణ పొందినవారు కాలక్షేపానికి వీటికి గింజలు వేస్తూ గడుపుతుంటారు.

పావురాలకు దూరంగా ఉండండి.. వాటితో సెల్ఫీ తీసుకోకండి