రాష్ట్రం జగన్ జాగీరి కాదు – పట్టాభి

88

సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించిన జగనన్న జీవన క్రాంతి పథకంపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత పట్టాభి. విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగనన్న జీవనక్రాంతి కాదు..జగనన్న భ్రాంతిలా ఉందని అన్నారు. 38 లక్షల గొర్రెలు, మేకలను అల్లనాగ్రూప్‌కి కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.

పాడిపరిశ్రమను అమూల్ సంస్థకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. జగనన్న జీవనక్రాంతి పేరుతో మరో క్విడ్ ప్రోకో దోపిడీకి తెరలేపారని ఎద్దేవ చేశారు. నచ్చిన కంపెనీలకు దోచిపెట్టడానికి రాష్ట్రమేమీ జగన్ జాగీరు కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు.