పదోతరగతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

141

తెలంగాణలో పదోతరగతి పరీక్షల తేదీలను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మే 17 నుంచి 26  వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో 11 పేపర్లు ఉండేది.. కానీ ఈ ఏడాది సబ్జెక్టుకి ఓ పేపర్ చొప్పున 6 పరీక్షలనే నిర్వహించనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 1 నుంచి పునప్రారంభమైన పాఠశాలలు ఆటంకం లేకుండా సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.

ఇక పాఠశాలకు రాని విద్యార్థులను బలవంత పెట్టడం లేదు ఉపాధ్యాయులు. ఇదిలా ఉంటే ఈ నెల 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించవచ్చని బోర్డు వెల్లడించింది. రూ.50 ఆలస్య రుసుంతో మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఎస్ఎస్సీ బోర్డు

పదోతరగతి ఎన్నికల షెడ్యూల్ విడుదల