రికార్డు స్థాయిలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం

86

లాక్ డౌన్ తర్వాత దేవాలయాల్లో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. మొదట్లో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కరోనా నిబంధనల వలన అధికారులు ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించలేకపోయారు. ఇక గత కొద్దీ రోజులుగా కరోనా తగ్గుముఖం పడుతుండటం.. నిబంధనల్లో సడలింపులు రావడంతో అధికారులు సాధారణ రోజుల్లో లాగానే దర్శనాలు కల్పిస్తున్నారు.

దింతో దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కార్తీక మాసంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దింతో స్వామివారికి వచ్చే కానుకలు కూడా పెరిగాయి. స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇక మంగళవారం హుండీలను లెక్కించారు అధికారులు.

మొత్తం రూ.3,61,34,086 లను భక్తులు కానుకలుగా ఇచ్చారని ఆలయ ఈవో కే ఎస్ రామారావు చెప్పారు. డబ్బుతోపాటూ 262.9 గ్రాముల గ్రాముల బంగారం, 6కేజీల 165 గ్రాముల వెండి, కొంత విదేశీ కరెన్సీని భక్తులు ఇచ్చారు. అందులో 160 అమెరికా డాలర్లు, 140 సౌదీ అరేబియా రియాలు ఇతరత్రా ఉన్నాయి. ఇదంతా 21 రోజుల్లో వచ్చిన ఆదాయం. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఇది వచ్చింది.

ఇంత భారీ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఓ రికార్డుగా మారింది. లాక్ డౌన్ తర్వాత భక్తులు పోటెత్తడంతో ఆదాయం భారీగా వచ్చినట్లు అధికారులు చెబుతన్నారు. కాగా విదేశీ భక్తుల తాకిడి ఈ ఏడాది బాగా పెరిగింది. విశాలనుంచి వచ్చిన భక్తులు శ్రీశైల అడవుల్లో యోగులను మునులను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రికార్డు స్థాయిలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం