శ్రీనివాసరావు ఉక్కుదీక్ష భగ్నం

301

కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారానికి 6 రోజు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆయన దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో పోలిసులు అతడ్ని విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీక్ష భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.

Image result for palla srinivasa rao

కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరుకు ఈ దీక్ష కొనసాగుతుందని అక్కడ ఉన్నవారు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీక్ష శిభిరం వద్ద ఉన్నవారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. వారు వినకపోవడంతో బలవంతంగా శ్రీనివాసరావు దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే తాను ఆసుపత్రిలో కూడా దీక్ష చేపడతానని, విరమించనని శ్రీనివాసరావు తెలిపారు.

Image result for palla srinivasa rao

ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా మంది శ్రీనివాసరావుకి మద్దతు పలికారు. రోజురోజుకూ ఉక్కు ఉద్యమం బలపడుతోంది. స్థానిక నేతలు ఎవరికి వారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కేంద్ర తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు కూడా సోమవారం కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలోని పరిష్టితిని వివరించారు. ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని బీజేపీ బృందం కేంద్ర పెద్దలకు తెలిపింది.

Image result for visakha ukku

అయితే మంగళవారం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పల్లా దీక్ష స్థలికి వెళ్లి ఆయన దీక్షకు మద్దతు పలకాలని అనుకున్నారు. అయితే బాబు వస్తే ఎలాంటి పరిస్థితిలు ఏర్పడతాయో అనే ఉద్దేశంతో శ్రీనివాసరావు దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తుంది. కాగా రోజు రోజుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం బలపడుతుంది. పార్టీలకు అతీతంగా దీనిని కందిస్తున్నారు.

Image result for visakha ukku