శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా గుర్తించాలి

140

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటిచే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర విద్యాశాఖామంత్రి రమేష్ పొక్రియాల్ కోరారు. 2007లో ఇది రాష్ట్ర విశ్వవిద్యాలయంగా గుర్తించబడిందని.

నాటి నుంచి వేదాల్లో డిగ్రీ నుంచి పీహెచ్డీ దాకా అనేక కోర్సులను నడుపుతున్నారని పొక్రియాల్ కు వివరించారు. ఈ మేరకు పొక్రియాల్ కు వినతిపత్రం అందించారు వైవి సుబ్బారెడ్డి. 2006 లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ప్రారంభించినట్లు తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా గుర్తించాలి

కాగా ప్రస్తుతం టీటీడీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని 80 వేద పాఠశాలలకు నిధులు సమకూరుస్తుంది. మరికొన్ని దేవాలయాలకు కూడా దూప దీప నైవేద్యాలు కోసం నెల నెల కొంత మొత్తం పంపుతుంది. వేద యూనివర్సిటీలో చదివిన వారికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది టీటీడీ.