ల్యాండ్‌ అవుతుండగా ‘స్సేస్‌ ఎక్స్’ క్రాష్‌…

90

మార్స్‌ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్‌ ఎక్స్’ హెవీ లిఫ్ట్‌ రాకెట్‌ స్టార్‌షిప్‌ నమూనా ఒకటి ల్యాండ్‌ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్‌లో బుధవారం ఉదయం టెస్ట్‌ లాంచ్‌ సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. కానీ సంస్థ మాత్రం ఎంతో ‘అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్‌ టీమ్‌కు ధన్యవాదాలు’ అంటూ మెసేజ్‌ చేయడం గమనార్హం. టెస్ట్‌ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ టెస్ట్‌ని ఉద్దేశించి ‘మార్స్‌‌.. మేం రాబోతున్నాం’ అంటు ట్వీట్‌ చేశారు. ల్యాండింగ్‌ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం.