తెలంగాణలో సోనూసూద్‌కు గుడి కట్టేశారు

124

కరోనా కష్టకాలంలో నయా మెస్సయాగా మారి ప్రతి ఒక్కరిచేత దేవుడుగా పిలిపించుకున్న నటుడు సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా ప్రజలు గుండెల్లో గుడి కట్టారు. లేటెస్ట్‌గా సోనూసూద్‌కు తెలంగాణలో నిజంగానే గుడి కట్టేశారు. గొప్ప వ్యక్తికి కొండంత అభిమానానికి నిదర్శనంగా గుడి కట్టేశారు కొంతమంది అభిమానులు. సిద్దిపేట జిల్లా దుబ్బాతండాలో సోనూసూద్‌కు గుడి కట్టి ఆయన విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు కొంతమంది యువకులు.

ఈ గుడికి సంబంధించిన ఫోటోలు సోనూసూద్ వరకు వెళ్లగా.. నాకెందుకండీ గుడి.. నేను అందుకు అర్హుడ్ని కాదంటూ వినమ్రంగా పోస్ట్ చేశారు. అయితే, గుడి కట్టిన ప్రజల అభిమానానికి మాత్రం ముగ్ధుడిని అయ్యానంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు సోనూసూద్‌. కరోనా కష్టకాలంలో ఎందరికో మంచి చేసిన సోనూసూద్.. సొంత ఊళ్లకు వెళ్లలేని వలసకార్మికులను సొంతగూటికి చేర్చి రియల్ హీరో అనిపించుకున్నారు.

అంతేకాదు.. ఆ తర్వాత కూడా ఎంతోమందికి సాయం చేసి వార్తల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురికి సాయం చేసి వార్తల్లో నిలిచారు సోనూసూద్.. చిత్తూరు జిల్లాలో ఓ పేద రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచారు సోనూసూద్.

సోనూ సూద్ కు గుడికట్టిన అభిమాని.. స్పందించిన నటుడు