ఎలక్షన్ కమిషన్ ను వైసీపీ పోటీ పార్టీగా భావిస్తుంది. – సోము వీర్రాజు

160

ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు, ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాయి. అధికార పార్టీ, ఎన్నికల కమిషన్ ఢీ అంటే ఢీ అనే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ ను వైసీపీ పోటీ పార్టీగా చూస్తుందని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఓ విధంగా ఎన్నికల కమిషన్ పై దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఇక కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఏపీకి నిధులు ఇవ్వలేదని విజయసాయి రెడ్డి ఆరోపణలు చెయ్యడం సరికాదని అన్నారు. ఏపీలో గృహనిర్మాణానికి 28 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

కేంద్రం కేటాయించిన నిధులకు మీ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు. వైసీపీ విధానాల వల్ల విద్యావ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతుందని సోమువీర్రాజు మండిపడ్డారు. ఇక మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల వేల జరుగుతున్నా దాడుల గురించి కూడా ప్రస్తావించారు వీర్రాజు, ప్రజాస్వామ్య దేశంలో నామినేషన్లు అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. దాడులను ఆపాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ నేతలు దాడులకు కూడా దిగుతున్నారు.

ఎలక్షన్ కమిషన్ ను వైసీపీ పోటీ పార్టీగా భావిస్తుంది. – సోము వీర్రాజు