Somu Veerraju : బీసీని సీఎం చేస్తాం, చంద్రబాబుకు, జగన్ కు ఆ దమ్ముందా?

251

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ఆ డబ్బు, జగన్ చంద్రబాబులకు ఉందా అని సవాల్ విసిరారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేస్తుంటే అధికారపార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు.

టీడీపీ, వైసీపీపై విమర్శలు

సోమువీర్రాజు టీడీపీ, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల వలన రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రము అభివృద్ధి పధంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం బీజేపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ద్వారా ఏపీ రూపురేఖలు పూర్తిగా మార్చాలని బిజెపి భావిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు ఏం చేశాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలపడుతుందని అన్నారు సోము వీర్రాజు.. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పంచాయితీ ఎన్నికల తర్వాత చేరికల ప్రక్రియ ముమ్మరంగా ఉంటుందని వివరించారు. అధికార పార్టీ నేతలు కూడా బీజేపీలోకి రానున్నట్లు తెలిపారు సోమువీర్రాజు. మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలతో పాటు టిడిపి నేతలు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తమ పార్టీతో వారంతా చర్చిస్తున్నారని పేర్కొన్నారు సోము వీర్రాజు. భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడం వల్ల రాయలసీమకు 200 టీఎంసీల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు, హోంమంత్రి అంటే చంద్రబాబు ఇంటికి కాదని, రాష్ట్రానికి హోంమంత్రి అని ఎద్దేవా చేశారు. జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు సోము వీర్రాజు. ఓ బీసీ ప్రధాని పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉందని ఆయన అన్నారు.

Somu Veerraju : బీసీని సీఎం చేస్తాం, చంద్రబాబుకు, జగన్ కు ఆ దమ్ముందా?