ఢిల్లీ పయనమైన సోము వీర్రాజు, బండి సంజయ్

98

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దింతో ఈ రోజు ఇద్దరు ఢిల్లీకి పయనమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి నివేదించనున్నారు ఇరువురు నేతలు. వీరిద్దరు ఢిల్లీ పెద్దలతో విడివిడిగా భేటీ కానున్నారు

బండి సంజయ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమవుతారు. ఇక సోము వీర్రాజు నడ్డాతోపాటు మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన నేరుగా ఢిల్లీ నుంచి తిరుపతికి వస్తారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలపై చర్చించేందుకే ఢిల్లీ నుంచి సోముకు పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక బండి 20 రోజుల వ్యవధిలో మూడోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికతోపాటు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరవాత పార్టీ బలపడిందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.

అయితే కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రైల్వే శాఖా సహాయమంత్రి పదవి కానీ మరేదైనా పదవి కానీ కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం.

ఢిల్లీ పయనమైన సోము వీర్రాజు, బండి సంజయ్