సినీ అభిమానుల ఆకలి తీర్చిన సోలో బ్రతుకే సో బెటరు. ఒక రోజు కలెక్షన్స్ వివరాలు

750

కరోనా కారణంగా 9 నెలల పాటు అన్ని థియేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. దింతో సినిమా ప్రేమికులు తెగ ఇబ్బంది పడ్డారు. ఓటీటీలపై పడిపోయారు. దింతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఇక కరోనా నిబంధనలు సడలించడంతో సోలో బ్రతుకే సో బెటరు సినిమా థియేటర్స్ లో విడుదలైంది.

దింతో సినీ ప్రేమికులు భారీగా థియేటర్లకు తరలి వెళ్తున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు 4.70 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దింతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక శని ఆదివారాల్లో కూడా ఇదేవిధంగా వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించారు. సుబ్బు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మించినారు. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించారు. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కుటుంబ సమేతంగా వెళ్లి చూడొచ్చని చెబుతన్నారు ప్రేక్షకులు..

ఇది ఇలా ఉంటే హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రంలో నటిస్తున్నారు. గురువారం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ సుకుమార్ రైటింగ్స్ తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తున్నారు.

సినీ అభిమానుల ఆకలి తీర్చిన సోలో బ్రతుకే సో బెటరు. ఒక రోజు కలెక్షన్స్ వివరాలు