సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు

139

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అసత్య, అసభ్య పోస్టులు పెట్టడం , ఇతరులను కించపరుస్తూ పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తోపాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. దీనిపై కేంద్ర సమాచారం మరియు ప్రసార శాఖామంత్రి ప్రకాశం జవదేకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయని తెలిపారు.

అంతే కాకుండా ఇతరులపై విమర్శలు గుప్పించడం కూడా అధికమైందని తెలిపారు. ఇటువంటి వాటిని కట్టడి చేసి.. అసత్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించేందుకు కొత్త నిబంధనలు తెచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఓటీటీ విషయంలో కూడా కొత్త నిబంధనలు తెచ్చినట్లు పేర్కొన్నారు జవదేకర్, ఓటీటీ వేదికగా అసభ్యకరమైన కంటెంట్ వస్తే ఊరుకునేది లేదని, దానికి సంబంధించి కూడా కఠిన నియమ నిబంధనలు తీసుకొచ్చామని వివరించారు. ఓటీటీలో అసత్య ప్రచారాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రకాష్ జవదేకర్.

సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు