సింగర్ సునీత పెళ్లి తేదీ ఖరారు

1132

సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడిస్తారు. పెద్ద సింగర్లతో పాటలు పాడి మంచి పేరు సంపాదించారు సునీత. ఇక ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుంది. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగింది. ఇక పెళ్లి ఈ నెలలోనే ఉంటుందని అందరు అనుకున్నారు, అయితే వచ్చే నెలలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

2021 జనవరి 9 రామ్, సునీతల వివాహం కొద్దీ మంది సన్నిహితుల మధ్య జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ఓ స్పెషల్‌ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి టాలీవుడ్‌ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ కూడా హాజరయ్యారు. స్పెషల్ పార్టీని హీరో నితిన్ దగ్గరుండి నడిపించారు. రామ్ తో నితిన్ కు మంచి స్నేహ సంబంధం ఉంది.

ఇక తమ అభిమాన సింగర్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్, ఇంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత త్వరగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఇంతకాలం సునీత ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొచ్చారు. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలను తానే పెంచారు. వారికి మంచి చదువులు చెప్పిస్తున్నారు.

కుటుంబ బాధ్యతలను తన భుజాలమీద వేసుకొని మోసిన సునీత ఎప్పుడు కూడా తాను పడుతున్న బాధలను చెప్పుకోలేదు. కానీ ఒక ఇంటర్వ్యూ ఆమె వివరంగా చెప్పారు. తనపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయని కానీ అవన్నీ వట్టి అబద్దాలను కొట్టిపారేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి భవిష్యత్ ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నానని తెలిపారు. సమాజంలో ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిత్వంతో ఉంటారని, ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడతారని, కానీ తాను వారు అనుకుంటున్నట్లు చెయ్యడం లేదని ఘాటుగానే బదులిచ్చారు. ఈ ఇంటర్వ్యూ అయిన కొద్దీ రోజులకే రామ్ తో సునీత నిశ్చితార్థం జరిగింది.

సింగర్ సునీత పెళ్లి తేదీ ఖరారు